కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-04-22T01:02:21+05:30 IST

మనం సాధారణ మనుషులమే. అవినీతికి వ్యతిరేకంగా చట్టం చేయాలని అడిగితే రాజకీయాల్లోకి రమ్మని సవాల్ చేశారు. వచ్చాం, పార్టీ పెట్టాం. పెట్టగానే ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు పంజాబ్ లో కూడా ఏర్పడింది. ఇక తర్వాత ఏర్పాటు కాబోయేది కర్ణాటకలోనే..

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కేజ్రీవాల్

బెంగళూరు: ఢిల్లీ, పంజాబ్ లలో ఆమ్ ఆద్మీ పార్టీని నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగానే కర్ణాటకలో సైతం ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం బెంగళూరులో రైతు సంఘాలు కలిసి నిర్వహించిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో కర్ణాటక రాజ్య రైత సంఘం కన్వీనర్ కొదిహల్లి చంద్రశేఖర్ ఆప్ లో చేరారు. అనంతరం, కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘మనం సాధారణ మనుషులమే. అవినీతికి వ్యతిరేకంగా చట్టం చేయాలని అడిగితే రాజకీయాల్లోకి రమ్మని సవాల్ చేశారు. వచ్చాం, పార్టీ పెట్టాం. పెట్టగానే ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు పంజాబ్ లో కూడా ఏర్పడింది. ఇక తర్వాత ఏర్పాటు కాబోయేది కర్ణాటకలోనే’’ అని అన్నారు. దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ చాలా ఏళ్లు పాలించాయని, ఆ రెండు పార్టీలే దేశాన్ని పూర్తి అవినీతిలోకి తీసుకెళ్లాయని అన్నారు. అయితే కాంగ్రెస్ 20శాతం అవినీతి ప్రభుత్వాలను నడిపితే బీజేపీ 40శాతం అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతోందని కేజ్రీవాల్ విమర్శించారు.

Updated Date - 2022-04-22T01:02:21+05:30 IST