భారత్లో కొత్తగా 2,487 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2022-05-15T17:11:26+05:30 IST
భారత్లో కొత్తగా 2,487 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ అక్కడక్కడ విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 2,487 కరోనా కేసులు నమోదు అవగా, కోవిడ్ వల్ల 13 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 17,692 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని 2878 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మొత్తం 5,24,214 మంది మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.