గోవాలో క్వాంటం గ్రూప్ కొత్త వెంచర్ * సీఎం సావంత్‌తో ఎస్‌వీఆర్, నీల్ సావంత్ భేటీ

ABN , First Publish Date - 2022-04-18T22:24:02+05:30 IST

ప్రముఖ సామాజిక సేవా సంస్థ ‘క్వాంటమ్ కోర్ ఇన్నోవేషన్ ఇంక్’ సౌత్ ఏషియా చైర్మన్ డాక్టర్ సరికొండ వినయ్ కుమార్ రెడ్డి(ఎస్‌వీఆర్), గ్లోబల్ క్వాంటం కోర్ ఛైర్మన్ డాక్టర్ నీల్ సావంత్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో ఫణాజిలో భేటీ అయ్యారు.

గోవాలో క్వాంటం గ్రూప్ కొత్త వెంచర్ * సీఎం సావంత్‌తో ఎస్‌వీఆర్, నీల్ సావంత్ భేటీ

హైదరాబాద్/ఫణాజి : ప్రముఖ సామాజిక సేవా సంస్థ ‘క్వాంటమ్ కోర్ ఇన్నోవేషన్ ఇంక్’ సౌత్ ఏషియా చైర్మన్ డాక్టర్ సరికొండ వినయ్ కుమార్ రెడ్డి(ఎస్‌వీఆర్), గ్లోబల్ క్వాంటం కోర్ ఛైర్మన్ డాక్టర్ నీల్ సావంత్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో ఫణాజిలో భేటీ అయ్యారు. ‘అతి చిన్న రాష్ట్రం’ ప్రాతిపదికన గోవాలో... కొత్త వెంచర్‌ను ప్రారంభించేందుకు క్వాంటమ్ కోర్ గ్రూప్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఇన్నోవేటివ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, టూరిజం, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, కల్చర్, బయోటెక్నాలజీ, మెడికల్ టూరిజం సహా గోవా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ గురించి తాము సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్‌తో సమావేశమైనట్లు నీల్ సావంత్, ఎస్‌వీఆర్ ఆ తరువాత వెల్లడించారు. లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ హబ్‌గా మారిన నేపథ్యంలో గోవాను భారత ఆర్థిక రాజధానుల్లో ఒకటిగా చేయాలనుకుంటున్నది తమ లక్ష్యంగా ఎస్‌వీఆర్, నీల్ సావంత్ పేర్కొన్నారు. 


ఇక గోవా సీఎం ప్రమోద్ సావంత్ అసాధారణమైన వ్యక్తి అని, గోవా అభివృద్ధికి సంబంధించి ఆయనకు  గొప్ప లక్ష్యం ఉందని ఎస్వీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే... క్వాంటమ్ కోర్ గ్రూప్ కొత్త వెంచర్‌ను గోవాలో ప్రారంభించాలని తాము నిర్దేశించుకున్నట్లు ఎస్వీఆర్, నీల్ సావంత్ వెల్లడించారు. ఇన్నోవేటివ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, టూరిజం, స్పోర్ట్స్, కల్చర్, బయోటెక్నాలజీ, మెడికల్ టూరిజం, గోవా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ రంగాల అభివ‌ృద్ధి ప్రాతిపదికన సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్‌తో సమావేశమైనట్లు నీల్ సావంత్, ఎస్‌వీఆర్ వెల్లడించారు. ప్రత్యేకించి పర్యాట రంగానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పేరున్న గోవాను... బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో జత చేయడంతోపాటు బ్లాక్ చెయిన్ రాజధానిగా మార్చడం తమ లక్ష్యంగా ఎస్వీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 


కాగా... గోవాకు మరిన్ని ఈశఈ పరిశ్రమలను తీసుకురావడంతోపాటు నిరుద్యోగులకు మరింత ఉపాధిని కల్పించాలని తమను గోవా సీఎం కోరినట్లు ఎస్‌వీఆర్, నీల్ సావంత్ ఈ సందర్భంగా వెల్లడించారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు మరిన్ని ఐటీ ఉద్యోగాలను సృష్టించగలమని ఆశిస్తున్నట్లు ఎస్‌వీఆర్ పేర్కొన్నారు. విద్యను, క్రీడలను అనుసంధానించడం ద్వారా విద్యార్ధులకు మంచి భవితవ్యాన్నివ్వాలన్నదే తమ లక్ష్యమని ఎస్‌వీఆర్ పేర్కొన్నారు. ఇక పర్యాటకాన్నిమరింతగా ప్రోత్సహించే క్రమంలో గోవాలో ఒలింపిక్స్ క్రీడలను తీసుకురావాలనుకుంటున్నది తమ మరో లక్ష్యంగా ఎస్‌వీఆర్ పేర్కొన్నారు. గోవా పాత సంస్కృతిని, పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడం తమ ఉద్దేశం లక్ష్యమని వివరించారు. వీటన్నింటి ప్రధాన లక్ష్యం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమేనన్నారు. ప్రత్యేకించి... మెడికల్ టూరిజం, ఫారెస్ట్ టూరిజంలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు.


 పర్యాటకానికి ప్రశాంతమైన ప్రదేశంగా ఉన్న నేపథ్యంలో గోవాను  సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నరాని, గోవాను పర్యాటకంగా తారస్థాయికి తీసుకెళ్ళేందుకు ఇదో మంచి వెసులుబాటు అని పేర్కొన్నారు.  పర్యావరణం దెబ్బతినకుండా అడవుల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమని డాక్టర్ ఎస్‌వీఆర్, నీల్ సావంత్ పేర్కొన్నారు. ఇన్నోవేటివ్ టెక్నాలజీలో భాగంగా గోవాలో భవిష్యత్ టెక్నాలజీలను తీసుకురావాలన్న తమ లక్ష్యానికి గోవా ప్రభుత్వం సహకరిస్తుందంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఎస్‌వీఆర్ తెలిపారు. గోవాను భవిష్యత్తులో ఇన్నోవేటివ్ టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మార్చాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాము గోవాలో ప్రారంభించనున్న క్వాంటం కోర్‌... అమెరికాలోని పబ్లిక్ కంపెనీలలో అత్యంత ప్రముఖమైనదని వెల్లడించారు. క్వాంటం కోర్... క్లీన్ ఎనర్జీలో విప్లవాత్మక పేటెంట్ టెక్నాలజీస్. అదే క్రమంలో ఎనిమిది పేటెంట్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. క్వాంటం కోర్ ప్రధాన పేటెంట్లు ఎమల్షన్, పైరోల్సిస్, పీఎల్‌ఏ క్వాంటమ్‌కోర్‌ను ప్రారంభించనున్నట్లు సావంత్ చెప్పారు.

 

క్వాంటమ్ కోర్ భారతదేశంలో వేల ఉద్యోగాలను సృష్టించగలదని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా... ఆయా రంగాలలో గోవా రాష్ట్ర అభివృద్ధికి తమతో సహా మరికొందరు పెట్టుబడిదారులు సహకరించేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు ఎస్‌వీఆర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే... గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ను నిర్వహించే విషయమై గోవా ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో ఓ కార్యాచరణను రూపొందించనున్నట్లు ఎస్‌వీఆర్, నీల్ సావంత్ వెల్లడించారు. 

Updated Date - 2022-04-18T22:24:02+05:30 IST