సెన్సొడైన్‌కు రూ. 10 లక్షల జరిమానా!

ABN , First Publish Date - 2022-03-23T07:17:20+05:30 IST

సెన్సొడైన్‌ టూత్‌పే్‌స్ట ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ.. ఆ సంస్థకు కేంద్ర వినియోగదారుల.....

సెన్సొడైన్‌కు రూ. 10 లక్షల జరిమానా!

ప్రకటనల్ని ఆపాలని సీసీపీఏ ఆదేశం


న్యూఢిల్లీ, మార్చి 22: సెన్సొడైన్‌ టూత్‌పే్‌స్ట ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ.. ఆ సంస్థకు కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థ(సీసీపీఏ) రూ. 10 లక్షల జరిమానాను విధించింది. వచ్చే వారంరోజుల లోపు అన్ని వేదికలపైనా సెన్సొడైన్‌ ప్రకటనల్ని నిలిపేయాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. తప్పుదోవ పట్టించే ప్రకటనలను అడ్డుకునేందుకు గాను ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీపై ఏర్పాటు చేసిన స్టాడింగ్‌ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పార్లమెంటులో ఒక నివేదికను సమర్పించింది.

Read more