మరో SriLankaను తలపిస్తున్న Nepal.. ఇంధన ధరలపై రాజధానిలో ఘర్షణ, కాల్పులు

ABN , First Publish Date - 2022-06-21T17:00:47+05:30 IST

నేపాల్(Nepal) మరో శ్రీలంక(SriLanka)ను తలపిస్తోంది. పెరిగిన ఇంధన ధరల(fuel price hike)పై సోమవారం నేపాల్ రాజధాని కాట్మండు(kathmandu)లో చేపట్టిన నిరసన(protest) అల్లర్లకు దారి తీసింది. విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది..

మరో SriLankaను తలపిస్తున్న Nepal.. ఇంధన ధరలపై రాజధానిలో ఘర్షణ, కాల్పులు

కాట్మండు: నేపాల్(Nepal) మరో శ్రీలంక(SriLanka)ను తలపిస్తోంది. పెరిగిన ఇంధన ధరల(fuel price hike)పై సోమవారం నేపాల్ రాజధాని కాట్మండు(kathmandu)లో చేపట్టిన నిరసన(protest) తీవ్ర స్థాయికి వెళ్లింది. విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఈ అల్లర్లలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని నేపాల్ పోలీసులు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేపాల్ ఆయిల్ కార్పొరేషన్(Nepal Oil Corporation) తాజాగా డీజిల్‌పై 12 శాతం, పెట్రోల్ 16 శాతం ధరల్ని పెంచింది. దీనిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(Nepal Communist Party) విద్యార్థి విభాగమైన ఆల్ నేపాల్ నేషనల్ ఫ్రీ స్టూడెంట్ యూనియన్(ANNFSU) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి బాధ్యత లేదని, ఈ తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ANNFSU నేత తగున్న డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయమై దినేష్ మినాలి అనే పోలీస్ అధికారి మాట్లాడుతూ నిరసనకారులు రాళ్లు విసిరారని, పోలీసు వాహనం ధ్వంసం చేశారని, అయితే ఎవరికీ గాయాలు కాలేదని ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-21T17:00:47+05:30 IST