నెహ్రూ కారు డ్రైవర్‌ మోనప్పగౌడ కన్నుమూత

ABN , First Publish Date - 2022-10-07T09:41:23+05:30 IST

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కారు డ్రైవర్‌గా పనిచేసిన మోనప్ప గౌడ కోరంబడ్క (102) బుధవారం కన్నుమూశారు.

నెహ్రూ కారు డ్రైవర్‌ మోనప్పగౌడ కన్నుమూత

బెంగళూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కారు డ్రైవర్‌గా పనిచేసిన మోనప్ప గౌడ కోరంబడ్క (102) బుధవారం కన్నుమూశారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణకన్నడ జిల్లా సుళ్య తాలూకా కనకమజలు గ్రామంలోని ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మోనప్పగౌడ, ఇటీవల కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆయన, ఢిల్లీలో గడిపారు. ఆ సమయంలోనే జవహర్‌లాల్‌ నెహ్రూకు డ్రైవర్‌గా వ్యవహరించారు.

Updated Date - 2022-10-07T09:41:23+05:30 IST