క్రిప్టో... ‘బ్యాంకింగ్’పై ప్రతికూల ప్రభావం

ABN , First Publish Date - 2022-05-18T03:08:58+05:30 IST

బ్యాంకింగ్ వ్యవస్థపై crypto currency ప్రతికూల ప్రభావం చూపుతుందని RBI అధికారులు భావిస్తున్నారు.

క్రిప్టో... ‘బ్యాంకింగ్’పై ప్రతికూల ప్రభావం

* ‘డాలరీకరణ’కు దారితీస్తుంది

- పార్లమెంటరీ ప్యానెల్ కు RBI నివేదన

న్యూఢిల్లీ/ముంబై : బ్యాంకింగ్ వ్యవస్థపై crypto currency ప్రతికూల ప్రభావం చూపుతుందని RBI అధికారులు భావిస్తున్నారు. క్రిప్టో కరెన్సీలు మారకపు మాధ్యమంగా ఉండగలవని, దేశీయ ఆర్థిక కార్యకలాపాల్లో రూపాయిని భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, అవి డబ్బు ప్రవాహాన్ని నిర్వహించే RBI సామర్థ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయని సెంట్రల్ బ్యాంక్ అధికారులు భావిస్తున్నారు.


క్రిప్టోకరెన్సీ ఆర్థిక వ్యవస్థలోని కొంత భాగాన్ని ‘డాలర్‌లీకరణ’కు దారితీయవచ్చని, ఇది భారతదేశ జాతీయ ప్రయోజనాలకు హానికరమని పార్లమెంటరీ ప్యానెల్‌కు RBI ఉన్నతాధికారులు నివేదించారు. RBI గవర్నర్ శక్తికాంత దాస్‌ సహా ఆర్‌బీఐ ఉన్నతాధికారులు, మాజీ ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అధ్యక్షతన ఉన్న ఆర్థిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో చర్చించారు. క్రిప్టోకరెన్సీల గురించి ఆందోళనలను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఇవి ముప్పుగా ఉన్నాయని చెప్పారు. క్రిప్టోకరెన్సీలు మార్పిడి మాధ్యమంగా, దేశీయ ఆర్థిక కార్యకలాపాల్లో  రూపాయిని భర్తీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ... అవి వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని నిర్వహించే RBI సామర్థ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయని సెంట్రల్ బ్యాంక్ అధికారులు భావిస్తున్నారు.


దాదాపు అన్ని క్రిప్టోకరెన్సీలు డాలర్-డినామినేట్ అయ్యాయని, విదేశీ ప్రైవేటు సంస్థలచే జారీ అవుతాయని, ఇది చివరికు భారత ఆర్థిక వ్యవస్థలో కొంత భాగాన్ని ‘డాలరైజేషన్’ చేయడానికి దారితీసే పరిస్థితికి నాంది పలికినట్లే అవుతుందని, ఇదే జరిగితే దేశ సార్వభౌమ ప్రయోజనాలకు విరుద్ధంగా పరిస్థితి ఉండే ప్రమాదముంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థపూ క్రిప్టో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని, ప్రజలు కష్టపడి సంపాదించిన పొదుపులను ఈ కరెన్సీలలో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.


ఇదే జరిగితే... బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తక్కువ వనరులు కలిగి ఉంటాయన్న ఆందోళన ఈ సందర్భంగా వ్యక్తమైంది. ఈ ఏడాది ప్రారంభంలో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో...  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రిప్టోకరెన్సీల్లో ట్రేడింగ్/నాన్-ఫంగబుల్ టోకెన్‌(NFT)ల వంటి సంబంధిత ఆస్తులపై 30 % పన్నును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆ తరహా లావాదేవీలు జరిగినప్పుడు TDS కింద... మూలం వద్ద 1 % తీసివేయబడుతుంది. భారతదేశంలో... 15 మిలియన్ల నుండి 20 మిలియన్ల వరకు క్రిప్టో పెట్టుబడిదారులు ఉన్నారని,  మొత్తం క్రిప్టో హోల్డింగ్‌లు సుమారు $ 5.34 బిలియన్లు ఉన్నారని అంచనాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ... క్రిప్టోకరెన్సీకి అగ్రగామిగా ఉన్న ఫిన్‌టెక్ విప్లవం నేపథ్యంలో మనీలాండరింగ్, తీవ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం, సాంకేతికతను ఉపయోగించడాన్ని నియంత్రించడమే ఏకైక పరిష్కారమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిందటి నెలలో పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-18T03:08:58+05:30 IST