Maharashtra రాజకీయ సంక్షోభానికి Modiనే కారణం: Narayana
ABN , First Publish Date - 2022-06-27T21:46:37+05:30 IST
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ప్రధాని మోదీనే కారణమని సీపీఐ నేత నారాయణ విమర్శించారు.

ఢిల్లీ (Delhi): మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ సంక్షోభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)యే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ (BJP) సంకుచిత రాజకీయ ప్రభావం మహారాష్ట్రపై పడిందని, గతంలో కర్ణాటక (Karnataka), మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఈడీ (ED), సీబీఐ (CBI)ని ఉసిగొల్పుతుందని, ఈడీ అనే గొర్రెల మంద.. మోదీ ఏం చెప్తే అది చేస్తారన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతివ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దేశ అధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా? అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థిగా ఎవరున్నా.. తాము వ్యతిరేకిస్తామని సీపీఐ నేత నారాయణ అన్నారు.