ఏం మామా.. బాగున్నావా...?

ABN , First Publish Date - 2022-09-07T18:22:05+05:30 IST

ఏమి మామా.. బాగున్నావా..? ఎన్నాళ్లకు కనిపించావు..! అంటూ కాంగ్రెస్‌ దిగ్గజాలు.. పలకరించడం పలువురిని ఆకట్టుకుంది.

ఏం మామా.. బాగున్నావా...?

                         - ఆకట్టుకున్న కాంగ్రెస్‌ నేతల పలకరింపులు


బళ్లారి(బెంగళూరు), సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఏం మామా.. బాగున్నావా..? ఎన్నాళ్లకు కనిపించావు..! అంటూ కాంగ్రెస్‌ దిగ్గజాలు.. పలకరించడం పలువురిని ఆకట్టుకుంది. మంగళవారం కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామిక వేత్త నారా సూర్యనారాయణరెడ్డి, మాజీ మం త్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ముండ్లూరు దివాకర్‌బాబు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్త పరిసీ ఇంట్లో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో చాలా మంది పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇందులో బాగంగానే నారా, ముండ్లూరు దివాకర్‌ బాబు మాటలు కలిపారు. నారా సూర్యనారాయణరెడ్డి కుమారుడు భరత్‌రెడ్డి, అలాగే ముండ్లూరు దివాకర్‌బాబు కుమారుడు అనుమకిషోర్‌ ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ రేసులో ఉన్నారు. ఇలాంటి సమయంలో వీరు ఇద్దరూ ఏమి మామా మన మంచి కాలం అయిపోయింది. ఇక వచ్చేదంతా పిల్లల కాలమే అంటూ ఆప్యాయంగా పలకరించుకోవడం ఆకట్టుకుంది. పెద్దల తరం ముగిసింది.. పిల్లలను రాజకీయాల్లోకి దింపుతున్నారంటూ పలువురు వ్యాఖ్యానించారు.

Read more