Rajya Sabhaలో అడుగుపెట్టడానికి నాకు అర్హత లేదా?: Nagma ట్వీట్
ABN , First Publish Date - 2022-05-30T18:41:16+05:30 IST
రాజ్యసభ టిక్కెట్ల ఎంపిక కార్యక్రమం కాంగ్రెస్ (Congress)లో కొత్త వివాదానికి దారి తీసింది.

ABN News Desk: రాజ్యసభ టిక్కెట్ల ఎంపిక కార్యక్రమం కాంగ్రెస్ (Congress)లో కొత్త వివాదానికి దారి తీసింది. నటి నగ్మా (Nagma) తన అసంతృప్తి స్వరాన్ని వినిపించారు. రాజ్యసభలో అడుగుపెట్టడానికి తనకు అర్హత లేదా? అంటూ ఆమె ట్వీట్ (Tweet) చేశారు. రాజ్యసభకు కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో నగ్మా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభకు కాంగ్రెస్ పది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో చాలా మంది ప్రముఖ నేతల పేర్లు లేవు. రాజ్యసభకు సీట్లు ఆశించిన పలువురు సీనియర్ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. ఈసారి రాజ్యసభకు వెళ్లాలని ఎంతగానో ఎదురు చూసిన నగ్మా.. తన కోరిక నెరవేరకపోవడంతో నిరసన స్వరం పెంచారు. 18 ఏళ్ల క్రితం పార్టీలో చేరిన సమయంలో మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సీటు ఇస్తానని సోనియా గాంధీ హామీ ఇచ్చారని, కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదని నగ్మా అన్నారు. కాగా నగ్మా ట్వీట్‌తో కాంగ్రస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.