ఉలేమాలకు Mumbai policeల విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-06-16T16:14:57+05:30 IST

జేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసనల్లో పాల్గొనవద్దని...

ఉలేమాలకు Mumbai policeల విజ్ఞప్తి

 శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసనల్లో పాల్గొనవద్దు...

ముంబై(మహారాష్ట్ర): బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసనల్లో పాల్గొనవద్దని ఉలేమాలకు ముంబై పోలీసులు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం ప్రార్థనల తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో ముంబై పోలీసు సీనియర్ అధికారులు ఉలామాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జూన్ 17వతేదీన శుక్రవారం ప్రార్థనల తర్వాత ముంబైలో ఆందోళన చేస్తామని వంచిత్ బహుజన్ అఘాడీ అధినేత, బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ప్రకటించారు.అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దిలీప్ సావంత్ (దక్షిణ ప్రాంతం), జ్ఞానేష్ చవాన్ (సెంట్రల్ రీజియన్), డీసీపీ జోన్ 3 యోగేష్ గుప్తా నాగ్‌పాడ సమీపంలోని బిలాల్ మసీదు వద్ద ఉలామాలను కలిశారు. 


సమావేశం అనంతరం శుక్రవారం నాటి నిరసనలో తాము పాల్గొనమని తాము పోలీసులకు చెప్పామని మౌలానా సయ్యద్ మొయినుద్దీన్ అష్రఫ్ తెలిపారు.మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు గాను నుపుర్ శర్మను అరెస్టు చేయాలని ఉలేమాలు డిమాండ్ చేశారు.ఉలేమాలు నిరసనలో పాల్గొనవద్దని తాము కోరామని,వారు సహకరిస్తారని హామీ ఇచ్చారని అదనపు పోలీసు కమిషనర్ జ్ఞానేష్ చవాన్ చెప్పారు.

Updated Date - 2022-06-16T16:14:57+05:30 IST