కోవైలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

ABN , First Publish Date - 2022-03-02T16:56:36+05:30 IST

mardc boam boamblast

కోవైలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

ప్యారీస్‌(చెన్పై): మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా మంగళవారం కోవైకు వచ్చారు. కోవై వెళ్లయంగిరి ప్రాంతం లోని ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి విమానంలో మంగళవారం మధ్యాహ్నం కోవై చేరిన ఓంబిర్లాకు సీపీఎం పార్లమెంటు సభ్యుడు నటరాజన్‌, తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఓంబిర్లా మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలో శాంతి నెలకొనాలని భారతీయులంతా ఆశిస్తున్నారని తెలిపారు. ప్రపంచమంతా ఒక కుటుంబంగా ఉండాలని, ఒక్కొక్క దేశం దాని సొంత సరిహద్దుల్లో ప్రశాంతంగా ఉండాలని, ఇతర దేశాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని భారతదేశం సర్వదా ఆకాంక్షిస్తోందని ఆయ

Read more