Tiranga bike rally: ఉత్సాహంగా పాల్గొన్న ఎంపీలు

ABN , First Publish Date - 2022-08-03T21:40:14+05:30 IST

చారిత్రక రెడ్ ఫోర్ట్ నుంచి అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు బుధవారంనాడు ''తిరంగా బైక్ ర్యాలీ''లో...

Tiranga bike rally: ఉత్సాహంగా పాల్గొన్న ఎంపీలు

న్యూఢిల్లీ: చారిత్రక రెడ్ ఫోర్ట్ (Red Fort) నుంచి అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు బుధవారంనాడు ''తిరంగా బైక్ ర్యాలీ'' (Tiranga bike rally)లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన తిరంగా బైక్ ర్యాలీ పార్లమెంటు సమీపంలోని విజయ్ చౌక్‌కు చేరుకోవడంతో ముగిసింది.


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల  స్మృత్యర్థం నిర్వహించిన ఈ ర్యాలీలో  పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు, యువ పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. పౌరుల్లో దేశభక్తి భావనలను మరింత ఉత్తేజపరిచేందుకు ఈ ఈవెంట్ నిర్వహించారు. ర్యాలీ మార్గంలో త్రివర్ణపతాకాలు రెపరెపలాడగా, ఎంపీలు తమ బైక్‌లకు త్రివర్ణ పతాకాలను తగిలించుకుని ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు.


కాగా, ''ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌''లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. పార్టీ సభ్యులు బూత్ స్థాయిల్లో ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకూ ''రఘపతి రాఘవ రాజారాం'' దేశభక్తి గీతాన్ని ఆలపిస్తూ ''ప్రభాత్ ఫెరి'' నిర్వహించాలని సూచించారు.

Updated Date - 2022-08-03T21:40:14+05:30 IST