నేను ఆ పార్టీ ఎంపీనే: Ravindranath

ABN , First Publish Date - 2022-07-22T13:04:30+05:30 IST

పార్టీకి తాను రాజీనామా చేయనందువల్ల తనను అన్నాడీఎంకే ఎంపీగానే పరిగణించాలని ఒ.పి.రవీంద్రనాధ్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. తే

నేను ఆ పార్టీ ఎంపీనే: Ravindranath

ప్యారీస్‌(చెన్నై), జూలై 21: పార్టీకి తాను రాజీనామా చేయనందువల్ల తనను అన్నాడీఎంకే ఎంపీగానే పరిగణించాలని ఒ.పి.రవీంద్రనాధ్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. తేని లోక్‌సభసభ్యుడు రవీంద్రనాథ్‌ను అన్నాడీఎంకే  నుంచి బహిష్కరించినందున ఆయనను ఆ పార్టీ సభ్యుడిగా పరిగణించకూడదంటూ ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన రవీంద్రనాథ్‌ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, రాజ్యాంగ శాసనం ప్రకారం ప్రజలు ఓటేసి తనను ఎంపీగా గెలిపించారన్నారు. అన్నాడీఎంకేకు సంబంధించిన కేసు ఇంకా న్యాయస్థానంలో విచారణ స్థాయిలోనే ఉందని, తీర్పు వచ్చేవరకూ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

Read more