Mother Dairy: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో లీటరుకు రూ.2 పెంపు

ABN , First Publish Date - 2022-12-26T17:31:35+05:30 IST

ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో పాల ధరను..

Mother Dairy: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో లీటరుకు రూ.2 పెంపు

న్యూఢిల్లీ: ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో పాల ధరను పెంచింది. లీటరుకు రూ.2 చొప్పున ధర పెంచుతున్నట్టు సోమవారంనాడు ప్రకటించింది. ధరల పెంపు మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఫుల్ క్రీమ్, టోన్డ్ మిల్క్, డబుల్ టోన్ట్ మిల్క్‌కు ఈ ధరల పెంపు వర్తిస్తుంది. కాగా, ఆవు పాలు, టోకెన్ మిల్క్ వేరియంట్‌ల ఎంఈర్‌పీలో ఎలాంటి పెంపు ఉండదని తెలిపింది. పాడి రైతుల నుంచి ముడిపాల సేకరణ వ్యయం పెరగడమే ధరల పెంపునకు కారణమని మదర్ డెయిరీ పేర్కొంది. కాగా, పాల ధరల పెంపు సామాన్యుల గృహ బడ్జెట్‌పై ఉంటుందని వినియోగదారులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-26T17:41:58+05:30 IST