CJI Justice Chandrachud : లాయర్‌గా ఉంటూనే రేడియో జాకీగా పనిచేశా..

ABN , First Publish Date - 2022-12-06T01:29:47+05:30 IST

ఒక ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం పార్ట్‌టైమ్‌గా మరో జాబ్‌ చేస్తుండడాన్ని ‘మూన్‌ లైటింగ్‌’గా పేర్కొనడం ఇటీవల

 CJI Justice Chandrachud : లాయర్‌గా ఉంటూనే రేడియో జాకీగా పనిచేశా..

న్యూఢిల్లీ, డిసెంబరు 5: ఒక ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం పార్ట్‌టైమ్‌గా మరో జాబ్‌ చేస్తుండడాన్ని ‘మూన్‌ లైటింగ్‌’గా పేర్కొనడం ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే తాను కూడా మూన్‌ లైటింగ్‌ చేశానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వెల్లడించారు. తాను 20-30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లాయర్‌గా పని చేస్తూ ఆకాశవాణిలో రేడియో జాకీగా పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. ‘ప్లే ఇట్‌ కూల్‌’, ‘ఏ డేట్‌ విత్‌ యూ’, ‘సండే రిక్వెస్ట్‌’ కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించినట్టు చెప్పారు. ఈ విషయం చాలా మందికి తెలియదన్నారు. ఇటీవల గోవాలోని న్యాయవిశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం సరికాదంటూ ఇటీవల కొన్ని ఐటీ కంపెనీలు సిబ్బందిని తొలగిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీజేఐ వ్యాఖ్యలకు విద్యార్థులు పెద్దయెత్తున హర్షధ్వానాలు చేశారు. తనకు సంగీతమంటే చాలా ఇష్టమని కూడా జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు.

Updated Date - 2022-12-06T11:31:54+05:30 IST