వారణాసిలో మోదీ భారీ రోడ్‌షో
ABN , First Publish Date - 2022-03-05T00:10:47+05:30 IST
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ..

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో శుక్రవారం సాయంత్రం భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ప్రజలకు అభివాదాలు తెలుపుతూ, కార్యకర్తల నినాదాల మధ్య ప్రధాని ఎంతో ఉత్సాహంగా రోడ్‌షోలో పాల్గొన్నారు. దీనికి ముందు, వారణాసిలోని మాల్దహియా చౌక్‌లోని సర్దార్ పటేల్వి గ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రధాని రోడ్‌షో సందర్భంగా అన్ని రోడ్డూ మోదీమయం అయ్యాయని, కాశీలో మోదీ పేరు మారుమోగిందని ఉత్తరప్రదేశ్ బీజేపీ యూనిట్ ఒక ట్వీట్ చేయడంతో పాటు రోడ్‌షో వీడియోను పోస్ట్ చేసింది. ఈనెల 7వ తేదీతో యూపీ పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. 10న ఫలితాలు వెలువడతాయి.