మోదీ, కేసీఆర్‌.. తోడు దొంగలే!

ABN , First Publish Date - 2022-08-01T08:42:01+05:30 IST

ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రానికి వరద సాయం, అనేక ఇతర పెండింగ్‌ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశించామని, అయితే అలాంటిదేమీ జరగకపోవడం దురదృష్టకరమని పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

మోదీ, కేసీఆర్‌.. తోడు దొంగలే!

ఐటీఐఆర్‌ను రద్దు చేయడం దారుణం: పొన్నాల 

న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రానికి వరద సాయం, అనేక ఇతర పెండింగ్‌ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశించామని, అయితే అలాంటిదేమీ జరగకపోవడం దురదృష్టకరమని పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ఆమోదించలేదని ఎనిమిదేళ్ల తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. మోదీ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండూ తోడు దొంగలే అన్నారు. ‘‘మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కేసీఆర్‌ నిరుద్యోగులకు ఎన్నో ఆశలు కల్పించారు. ఉద్యోగాల కల్పన విషయంలో వీళ్లు ఏమైనా శ్రద్ద తీసుకున్నారా’’ అని లక్ష్మయ్య ప్రశ్నించారు. తాము కేంద్రాన్ని ఒప్పించి ఐటీఐఆర్‌ ప్రణాళికను ముందుపెడితే దాన్ని నీరుగార్చారని తెలిపారు. రూ.2లక్షల కోట్ల పెట్టుడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన ఐటీఐఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.

Updated Date - 2022-08-01T08:42:01+05:30 IST