Raj Thackeray Birthday: పెట్రోలు ధర సగానికి తగ్గింది!
ABN , First Publish Date - 2022-06-14T20:25:56+05:30 IST
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray

ముంబై : మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) 54వ పుట్టిన రోజును ఆ పార్టీ కార్యకర్తలు వినూత్నంగా నిర్వహించారు. ఔరంగాబాద్‌లోని క్రాంతి చౌక్ పెట్రోలు బంకు వద్ద లీటరు పెట్రోలును రూ.54 చొప్పున విక్రయించారు. మంగళవారం పూర్తిగా ఇదే ధరకు విక్రయిస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షులు మౌలి థోర్వే, సవిత థోర్వే చెప్పారు.
మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఎంఎన్ఎస్ కార్యకర్తలు షెగావ్‌లోని సంత్ గజానన్ మహారాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజ్ థాకరే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ప్రార్థించారు. ఔరంగాబాద్ జిల్లా ఎంఎన్ఎస్ అధ్యక్షుడు సుమిత్ మాట్లాడుతూ, వాహనదారులు ఉదయం ఆరు గంటల నుంచి సగం ధరకే పెట్రోలు కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. సగం ధరకే పెట్రోలును అమ్ముతుండటంపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు.
రాజ్ థాకరే సోమవారం విడుదల చేసిన ఆడియో సందేశంలో తాను శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నానని చెప్పారు. కోవిడ్ డెడ్ సెల్ గురించి డాక్టర్లు తనకు చెప్పారని, తెలిపారు. తనకు జరగవలసిన శస్త్ర చికిత్స వచ్చే వారానికి వాయిదా పడినట్లు తెలిపారు. జూన్ 14న తన పుట్టిన రోజు అని, తాను ఎవరినీ కలవలేనని తెలిపారు.