Minister's suggestion: రైల్వే శాఖ సమన్వయంతో ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-11-30T10:40:19+05:30 IST

రాష్ట్రంలో పలు జిల్లాల్లో నిర్మాణ దశలో ఉన్న రైల్వే ఫ్లై ఓవర్‌ పనులను ఆ శాఖ సమన్వయంతో త్వరితగతిన పూర్తిచేయాలని రహదారుల శాఖ అధికారులకు ఆ శాఖ

Minister's suggestion: రైల్వే శాఖ సమన్వయంతో ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టాలి

- రహదారుల శాఖ అధికారులకు

- మంత్రి ఏవీ వేలు సూచన

ప్యారీస్‌(చెన్నై), నవంబరు 29: రాష్ట్రంలో పలు జిల్లాల్లో నిర్మాణ దశలో ఉన్న రైల్వే ఫ్లై ఓవర్‌ పనులను ఆ శాఖ సమన్వయంతో త్వరితగతిన పూర్తిచేయాలని రహదారుల శాఖ అధికారులకు ఆ శాఖ మంత్రి ఏవీ వేలు(Minister AV Velu) ఆదేశించారు. గిండిలో ఉన్న రహదారుల శాఖ పరిశోధన కేంద్రంలో మంత్రి ఏవీ వేలు అధ్యక్షతన సోమవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రహదారులు, దక్షిణ రైల్వే అధికారులనుద్ధేశించి మంత్రి మాట్లాడారు. అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీతో రోడ్లు, వంతెనలు, ఫ్లై ఓవర్లు నిర్మాణం ఉండాలన్నారు. రోడ్డు పక్కన ఏర్పాటుచేసిన తాగునీటి పైపులు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను మార్చడం, రోడ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న చెట్లు తొలగించడం తదితరాలు ప్రణాళికబద్ధంగా నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో రహదారుల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ప్రదీప్‌ యాదవ్‌, డైరెక్టర్‌ గణేశన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T10:40:19+05:30 IST

Read more