Minister: తిరుచ్చిలో క్రీడా నగరం

ABN , First Publish Date - 2022-10-07T16:04:31+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో అనువైన స్థలం అందుబాటులో లేకుంటే తిరుచ్చి నగరంలో ఎంపిక చేసే స్థలంలో క్రీడా నగరం ఏర్పాటుచేయనున్నట్లు క్రీడల

Minister: తిరుచ్చిలో క్రీడా నగరం

                                      - మంత్రి మెయ్యనాధన్‌


ప్యారీస్‌(చెన్నై), అక్టోబరు 6: రాజధాని నగరం చెన్నైలో అనువైన స్థలం అందుబాటులో లేకుంటే తిరుచ్చి నగరంలో ఎంపిక చేసే స్థలంలో క్రీడా నగరం ఏర్పాటుచేయనున్నట్లు క్రీడల శాఖ మంత్రి మెయ్యనాధన్‌(Minister Meyyanadhan) పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి గురువారం మీడియాతో మాట్లాడుతూ, తిరుచ్చి-తంజావూరు(Trichy-Thanjavur) జాతీయ రహదారిలో ఉన్న చెంగల్పట్టులో క్రీడా నగరం ఏర్పాటుపై ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. క్రీడలకు ప్రసిద్ధిచెందిన నగరంగా చెన్నై రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని, క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రధాన నగరాల్లో క్రీడా మైదానాలను అత్యాధునిక వసతులతో నిర్మించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి మెయ్యనాధన్‌ తెలిపారు.

Updated Date - 2022-10-07T16:04:31+05:30 IST