Minister Udayanidhi: ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పదో స్థానంలో మంత్రి ఉదయనిధి

ABN , First Publish Date - 2022-12-15T10:45:33+05:30 IST

రాష్ట్రప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న మంత్రుల జాబితాలో ఉదయనిధి(Udayanidhi) పేరు 10వ స్థానంలో ఉంది. చేపాక్కం-

Minister Udayanidhi: ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పదో స్థానంలో మంత్రి ఉదయనిధి

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 14: రాష్ట్రప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న మంత్రుల జాబితాలో ఉదయనిధి(Udayanidhi) పేరు 10వ స్థానంలో ఉంది. చేపాక్కం-ట్రిప్లికేన్‌ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, ఆయనకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి, ప్రత్యేక పథకాల అమలు, పేదరిక నిర్మూలన శాఖలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రప్రభుత్వ అధికారిక www.tn.gov.in/ ministerlist వెబ్‌సైట్‌లో ఉదయనిధి పేరు 10వ స్థానంలో చేర్చారు. ఆ ప్రకారం, ముఖ్యమంత్రి స్టాలిన్‌, దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, ఐ.పెరియస్వామి, కేకేఎ్‌సఎ్‌సఆర్‌ రామచంద్రన్‌, తంగం తెన్నరసు తదితరుల తర్వాత ఉదయనిధి పేరు చోటుచేసుకుంది.

Updated Date - 2022-12-15T10:45:34+05:30 IST