Minister: పౌష్ఠికాహార కేంద్రాలు మూసే ప్రసక్తే లేదు
ABN , First Publish Date - 2022-12-07T10:02:53+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌష్ఠికాహార కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదని సామాజిక సంక్షేమం, పౌష్ఠికాహార శాఖ మంత్రి గీతా జీవన్(Minister Geeta Jeevan) స్పష్టం చేశారు.
- మంత్రి గీతాజీవన్
ప్యారీస్(చెన్నై), డిసెంబరు 6: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌష్ఠికాహార కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదని సామాజిక సంక్షేమం, పౌష్ఠికాహార శాఖ మంత్రి గీతా జీవన్(Minister Geeta Jeevan) స్పష్టం చేశారు. దివ్యాంగులకు రాయితీలు ప్రకటించిన ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)ను మంగళవారం ఉదయం సచివాలయానికి దివ్యాంగులతో కలసివెళ్లిన మంత్రి గీతా జీవన్ వారి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పౌష్ఠికాహార కేంద్రాలు మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన కథనాలు అవాస్తవమన్నారు. రాష్ట్రంలో 43,190 పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పౌష్ఠికాహార కేంద్రాల్లో సుమారు 46 లక్షల మంది విద్యార్థులు లబ్దిపొందుతున్నారని తెలిపారు.