Minister anger: ఇదేం జాతీయ విద్యావిధానం?

ABN , First Publish Date - 2022-09-13T13:18:16+05:30 IST

దేశంలో 3, 5, 8 తరగతులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు యత్నిస్తున్నారని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి(Higher Educ

Minister anger: ఇదేం జాతీయ విద్యావిధానం?

- ప్రాథమిక తరగతులకు ప్రవేశ పరీక్షలా !

- మంత్రి పొన్ముడి ఆగ్రహం


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 12: దేశంలో 3, 5, 8 తరగతులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు యత్నిస్తున్నారని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి(Higher Education Minister Ponmudi) ఆరోపించారు. జాతీయ విద్యావిధానం పేరుతో చిన్నారులపై ఇలా పరీక్షలు రుద్దడం ఎంతమేరకు భావ్యమని ప్రశ్నించారు. స్థానిక అన్నా విశ్వవిద్యాలయంలో ‘నాన్‌ ముదల్‌వన్‌’ పథక మండల మహానాడు సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్ముడి మాట్లాడుతూ... ఇంజినీరింగ్‌ పాఠ్యప్రణాళికలాగే ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలల పాఠ్య ప్రణాళికల్లోనూ మార్పులు చేపట్టనున్నామన్నారు. ఇంజనీరింగ్‌ మొదటి, రెండో సంవత్సర పాఠ్యప్రణాళికలో మార్పులు చేయగా, మూడో సంవత్సరానికి కూడా కొత్త పాఠ్య ప్రణాళిక ప్రవేశపెట్టానున్నామని తెలిపారు. గత పాఠ్య ప్రణాళికకు బదులుగా ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్పులు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2022-09-13T13:18:16+05:30 IST