Minister: లిఫ్ట్‌లో చిక్కుకున్న ఆరోగ్యశాఖ మంత్రి

ABN , First Publish Date - 2022-11-30T08:13:18+05:30 IST

స్థానిక స్టాన్లీ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం(Minister Subramaniam) లిఫ్ట్‌లో చిక్కుకోవడంతో కలకలం రేగింది. మంగళ

Minister: లిఫ్ట్‌లో చిక్కుకున్న ఆరోగ్యశాఖ మంత్రి

- ఎమెర్జెన్సీ ద్వారం నుంచి బయటపడిన సుబ్రమణ్యం

- స్టాన్లీ ఆసుపత్రిలో కలకలం

పెరంబూరు(చెన్నై), నవంబరు 29: స్థానిక స్టాన్లీ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం(Minister Subramaniam) లిఫ్ట్‌లో చిక్కుకోవడంతో కలకలం రేగింది. మంగళవారం ఉదయం ఆస్పత్రి పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి.. కొన్ని వార్డుల్లో తనిఖీ చేశారు. అనంతరం మూడో అంతస్తు నుంచి దిగువ అంతస్తుకు వచ్చేందుకు లిఫ్ట్‌(Lift) ఎక్కారు. ఆయనతో పాటు కేవలం ఇద్దరు మాత్రమే వున్నారు. అయితే లిఫ్ట్‌ మధ్యలో నిలిచిపోయింది. రెండు నిమిషాలైనా కిందకు రాకపోవడంతో భద్రతా సిబ్బంది, ఆసుపత్రి ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన చెందారు. ఇంతలో మంత్రి లిఫ్ట్‌లో వున్న ఎమర్జెన్సీ అలారం మోగించడంతో లోపల ఏదో జరిగిందని అనుమానించిన భద్రతా సిబ్బంది లిఫ్ట్‌ తెరిచేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. హుటాహూటీన సాంకేతిక సిబ్బందిని రప్పించి ఎమర్జెన్సీ తలుపు తెరిపించి మంత్రిని, ఆయన వెంట వున్న అధికారులకు బయటకు తీశారు. ఈ ఘటన కారణంగా ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి లిఫ్ట్‌లో చిక్కుకున్నట్లు సమాచారం తెలియగానే భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అయితే ఆయన క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2022-11-30T08:13:20+05:30 IST