‘నీట్’పై త్వరలో శుభవార్త: Minister
ABN , First Publish Date - 2022-05-20T18:42:26+05:30 IST
నీట్ పరీక్షకు సంబంధించి త్వరలో శుభవార్త వస్తుందని మంత్రి ఏవీ వేలు తెలిపారు. మదురైలో ఆయన గురువారం మాట్లాడుతూ, అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో నీట్ ప

పెరంబూర్(చెన్నై): నీట్ పరీక్షకు సంబంధించి త్వరలో శుభవార్త వస్తుందని మంత్రి ఏవీ వేలు తెలిపారు. మదురైలో ఆయన గురువారం మాట్లాడుతూ, అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో నీట్ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపామన్నారు. ప్రస్తుతం గవర్నర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారని, మరో రెండ్రోజుల్లో నీట్ పరీక్షపై రాష్ట్రప్రభుత్వం ఆశించిన శుభవార్త రానుందని, దీంతో వైద్యులు కావాలనే పేద విద్యార్థుల కల సాకారం అవుతుందని మంత్రి తెలిపారు.