Mining mafia: డీఎస్‌పీ హత్య జరిగి రెండు నెలలు తిరక్కుండానే మళ్లీ పోలీస్ టీమ్‌పై దాడి

ABN , First Publish Date - 2022-09-10T21:08:18+05:30 IST

హర్యానాలో మరోసారి మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. రెండు నెలల క్రితం డిప్యూటీ..

Mining mafia: డీఎస్‌పీ హత్య జరిగి రెండు నెలలు తిరక్కుండానే మళ్లీ పోలీస్ టీమ్‌పై దాడి

చండీగఢ్: హర్యానాలో మరోసారి మైనింగ్ మాఫియా (Mining mafia) రెచ్చిపోయింది. రెండు నెలల క్రితం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)ను మాఫియా ముఠా అత్యంత దారుణంగా ట్రక్‌తో ఢీకొట్టి చంపిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనమైంది. తాజాగా శుక్రవారంనాడు మరోసారి మైనింగ్ మాఫియా తెగబడింది. నెహ్ (Neh) జిల్లాలో పోలీసులు, స్థానిక మైనిక విభాగం రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) సంయుక్త బృందంపై మైనింగ్ మాఫియా దాడి జరిపినట్టు పోలీసులు తెలిపారు. అక్రమంగా మైనింగ్ జరుగుతోందన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన సంయుక్త బృందంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.


కాగా, దాడికి పాల్పడిన వారిలో ఐదుగురిని గుర్తించామని, వారితో పాటు 40 నుంచి 40 నుంచి గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని నుహ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్‌పీ) ఉషా కుందు తెలిపారు. మూడు ప్రొక్లైన్ మిషన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గత జూలై 19న ఇదే నుహ్‌లో అక్రమ మైనింగ్ సమాచారంతో అక్కడకు వెళ్లిన డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌ను మాఫియా ముఠా పొట్టనపెట్టుకుంది. ఆయన మీద నుంచి ట్రక్‌ నడపడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన షబీర్ అలియాస్ మిట్టర్‌ను జూలై 20న చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ అనంతరం హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. బిష్ణోయ్ కుంటాబానికి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తార్ కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.

Updated Date - 2022-09-10T21:08:18+05:30 IST