చెన్నై మేయర్‌గా దళిత మహిళ
ABN , First Publish Date - 2022-03-05T07:10:30+05:30 IST
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) మేయర్‌గా తొలిసారి ఎన్నికైన దళిత మహిళ ప్రియ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 200 మంది..
పిన్నవయస్కురాలిగానూ రికార్డు
చెన్నై, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) మేయర్‌గా తొలిసారి ఎన్నికైన దళిత మహిళ ప్రియ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 200 మంది కార్పొరేటర్లలో 153 మంది డీఎంకే కార్పొరేటర్లు ఆది ద్రావిడ (ఎస్‌సీ) వర్గానికి చెందిన ప్రియను మేయర్‌గా ఎన్నుకున్నారు. 350 సంవత్సరాల చెన్నై కార్పొరేషన్ చరిత్రలో దళిత మహిళ మేయర్ పదవిని అధిరోహించగా, ఆ పదవిని సొంతం చేసుకున్న 28 ఏళ్ల ప్రియ అతి పిన్నవయస్కురాలిగానూ రికార్డులకెక్కారు. ప్రియ భర్త రాజా ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.