Mettur Dam: నిండిన మేట్టూరు డ్యాం
ABN , First Publish Date - 2022-10-16T15:54:09+05:30 IST
సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాం(Mettur Dam) నుంచి 1.10 లక్షల ఘనపుటడుగుల నీరు విడుదల చేస్తుండడంతో 11 డెల్టా జిల్లాలకు వరద
- 11 డెల్టా జిల్లాలకు వరద హెచ్చరిక
పెరంబూర్(చెన్నై), అక్టోబరు 15: సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాం(Mettur Dam) నుంచి 1.10 లక్షల ఘనపుటడుగుల నీరు విడుదల చేస్తుండడంతో 11 డెల్టా జిల్లాలకు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. కర్ణాటక, కావేరి నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మేట్టూరు డ్యాం(Mettur Dam) 120 అడుగుల పూర్తిస్థాయికి చేరింది. అనంతరం డ్యాంలో వచ్చిన చేరుతున్న సుమారు 2 లక్షలకు పైగా ఘనపుటడుగుల నీటిని దిగువకు విడుదల చేయడంతో డెల్టా జిల్లాల్లో వరదలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, రుతుపవనాల ప్రభావం తగ్గుముఖం పట్టడంతో డ్యాంలోకి వస్తున్న నీటి మట్టం తగ్గి పూర్తిస్థాయికి దిగువన 119 అడుగులకు చేరింది. అనంతరం కావేరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వారం రోజుల క్రితం డ్యాం పూర్తిస్థాయికి చేరింది. ప్రస్తుతం కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం డ్యాంకు 80 వేల ఘనపుటడుగుల నీరు వస్తుండగా, శనివారం ఉదయం 1.10 లక్షల ఘనపుటడుగులకు పెరిగింది. ఇప్పటికే డ్యాం పూర్తిస్థాయికి చేరుకోవడంతో డ్యాంలోకి వస్తున్న నీటిని అదే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో, కావేరి నది(Kaveri river) పరివాహక జిల్లాలైన సేలం, నామక్కల్, ఈరోడ్, కరూర్, తిరుచ్చి, అరియలూరు, తంజావూరు, తిరువారూర్ సహా 12 జిల్లాలకు వరద ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. గ్రామాల్లో రెవెన్యూ అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.