Metro Rail: మెట్రో రైల్‌ సర్వీసుల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-11-04T10:57:05+05:30 IST

నగరంలో కురిసిన కుండపోత వర్షం(Rain) కారణంగా ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది.

Metro Rail: మెట్రో రైల్‌ సర్వీసుల పునరుద్ధరణ

అడయార్‌(చెన్నై), నవంబరు 3: నగరంలో కురిసిన కుండపోత వర్షం(Rain) కారణంగా ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఇందులో భాగంగా మెట్రో రైల్‌(Metro Rail) సర్వీసులను కూడా నిలిపివేశారు. కొన్ని స్టేషన్లలో అండర్‌ గ్రౌండ్‌లోకి వర్షపునీరు చేరడంతో పాటు సిగ్నెలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక సమస్య, ఓహెచ్‌ఈ పవర్‌ సప్లై ఆగి మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అయితే, గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం లేక పోవడంతో మెట్రో రైల్‌ సర్వీస్‌ మార్గంలో అవాంతరాలను సరిచేశారు. ముఖ్యంగా ఓహెచ్‌ఈ పవర్‌ సప్లై పునరుద్ధరించారు. దీంతో వింకో నగర్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్‌ సర్వీసులను నడిపారు.

Updated Date - 2022-11-04T10:57:08+05:30 IST