Chennai: తిరువణ్ణామలైలో వ్యాపారి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-10-17T18:13:43+05:30 IST

తిరువణ్ణామలై జిల్లా తాండ్రాంపట్టు సమీపంలోని తరటాపట్టు అనే గ్రామంలో రవీంద్రన్‌ (45) అనే వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు

Chennai: తిరువణ్ణామలైలో వ్యాపారి దారుణ హత్య

చెన్నై/అడయార్‌: తిరువణ్ణామలై జిల్లా తాండ్రాంపట్టు సమీపంలోని తరటాపట్టు అనే గ్రామంలో రవీంద్రన్‌ (45) అనే వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన ముంబైలో పూల వ్యాపారం చేస్తుండగా, ఈయనకు భార్య విజయశాంతి ఒక కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు  రెండు రోజుల క్రితం రవీంద్రన్‌ సొంతూరుకు వచ్చి తన ఇంటిలోనే ఉన్నారు. ఆదివారం ఉదయం ఆ ఇంటి తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి ఇంటిలోపల చూడగా, గొంతుకోసిని స్థితిలో శవంగా పడివుండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాఽధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-10-17T18:13:43+05:30 IST