Member of Parliament: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను

ABN , First Publish Date - 2022-12-31T12:34:11+05:30 IST

ఇకపై ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేయదలచుకోలేదని బీజేపీ ఎంపీ బచ్చేగౌడ(BJP MP Bachegowda) ప్రకటించారు. శుక్రవారం

Member of Parliament: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను

- ఎంపీ బచ్చేగౌడ

బెంగళూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇకపై ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేయదలచుకోలేదని బీజేపీ ఎంపీ బచ్చేగౌడ(BJP MP Bachegowda) ప్రకటించారు. శుక్రవారం హొసకోట తాలూకా నడువినపుర గ్రామంలో పునీత్‌రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ లోక్‌సభ సభ్యుడిగా 2024దాకా గడువు ఉందని అప్పటిదాకా పదవిలో ఉంటానన్నారు. కాగా మరో నాలుగు నెలలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో తన కుమారుడు శరత్‌ బచ్చేగౌడను గెలిపించాలని ప్రజలను కోరారు. హొసకోట తాలూకాకు ఒక మంచి యువనాయకుడు వచ్చారంటూ కుమారుడిని కొనియాడారు. ఎమ్మెల్యేగా శరత్‌ బచ్చేగౌడ మంచి పనులు చేస్తున్నారన్నారు. ఎన్నికలకు దూరమైనా ప్రజల మధ్యనే ఉంటానన్నారు. బీజేపీ ఎంపీగా ఉంటూనే రెండేళ్ళకిందట హొసకోట శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఎంటీబీ నాగరాజుకు కాకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కుమారుడు శరత్‌కు మద్దతు ఇచ్చిన విషయం వివాదాస్పాదమైంది. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే శరత్‌ ప్రత్యక్షంగానే కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థిగానే పోటీ చేస్తారు. అయినా బీజేపీ ఎంపీగా ఉంటూ మద్దతు ఇవ్వాలనే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Updated Date - 2022-12-31T12:34:15+05:30 IST