Srinagarలోని అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-03-05T13:32:11+05:30 IST
జమ్మూకశ్మీర్‌లోని అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది...

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.శ్రీనగర్‌లోని బర్జుల్లాలోని ప్రభుత్వ ఆర్థోపెడిక్ ఆసుపత్రిని మంటలు చుట్టుముట్టాయి. మంటల మధ్య ఆసుపత్రి నుంచి రోగులు,వారి సహాయకులను సురక్షితంగా బయటకు తరలించారు.ప్రత్యేక ఆసుపత్రిలోని గ్యాస్ సిలిండర్లు, వైద్య పరికరాలు పేలడంతో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.అగ్నిప్రమాదం జరిగిన ఆసుపత్రిలో 250 పడకలు ఉన్నాయి. మూడు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అన్ని వార్డులు రోగులు, అటెండర్లతో నిండి ఉన్నాయి.అగ్నిప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదని అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదాన్ని మొదట ఎమర్జెన్సీ థియేటర్లో గుర్తించారు.ఆపరేషన్ థియేటరులో సంభవించిన అగ్నిప్రమాదం అన్ని వార్డుల్లోకి త్వరగా వ్యాపించింది.ఈ అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రోగులందరినీ సురక్షితంగా తరలించామని అధికారులు చెప్పారు.అగ్నిమాపక శాఖ వాహనాలు వచ్చి ఆసుపత్రిలో మంటలను ఆర్పారు.