మాస్కు పెట్టు.. బుడ్డీ పట్టు

ABN , First Publish Date - 2022-06-30T13:20:32+05:30 IST

క్వార్టర్‌ బాటిల్‌ కోసం మందుబాబులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. సరదాగా తీసుకునేవారి సంగతి పర్లేదు గానీ, నిత్యం ఆ మత్తులో మునిగేవారికి బాటిల్‌

మాస్కు పెట్టు.. బుడ్డీ పట్టు

                         - టాస్మాక్‌ దుకాణాల వద్ద మందుబాబులు


చెన్నై, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): క్వార్టర్‌ బాటిల్‌ కోసం మందుబాబులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. సరదాగా తీసుకునేవారి సంగతి పర్లేదు గానీ, నిత్యం ఆ మత్తులో మునిగేవారికి బాటిల్‌ దొరకడం కాస్త ఆలస్యమైనా కష్టమే మరి! కావాల్సినప్పుడు నాలుగు చుక్కలతోనైనా గొంతు తడుపుకోకపోతే వారి బాధ వర్ణనాతీతం. టాస్మాక్‌ సంస్థ దీనిని బాగా గ్రహించినట్లుంది. అందుకే గుంపులుగుంపులుగా మద్యం దుకాణాల వద్ద గుమిగూడే మందుభాయ్‌లతో కరోనా వైరస్‌ విస్త్రతంగా వ్యాపిస్తుండడంతో దీనిని కట్టడి చేసేందుకు టాస్మాక్‌ సంస్థ ఓ షరతు పెట్టింది. మాస్కు పెట్టుకుని వస్తేనే మందు ఇస్తామని తేల్చి చెప్పింది. బుధవారం నుంచే ఆ ఉత్తర్వులు అమలులోకి రావడంతో మాస్క్‌ లేకుండా వచ్చిన వారిని టాస్మాక్‌ సిబ్బంది వెనక్కి పంపించేశారు.  దీంతో మందుబాంబులు కాస్త ‘క్రమశిక్షణ’తో దుకాణాల వద్దకొచ్చారు. ముచ్చటగా మాస్క్‌ పెట్టుకొచ్చి బుడ్డీ పట్టుకుపోయారు. 

Updated Date - 2022-06-30T13:20:32+05:30 IST