చదువుకుంటుంటే చిన్నారి ఏడుస్తున్నాడని వదినను చంపేశాడు

ABN , First Publish Date - 2022-04-19T22:57:59+05:30 IST

నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక వ్యక్తి.. చదువుకునే సమయంలో తన సోదరుడి కుమారుడు ఇబ్బంది కలిగిస్తున్నాడని వదినను కత్తితో పొడిచి చంపాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్‌లో మంగళవారం ఈ ఘటన జరిగిందని స్థానిక..

చదువుకుంటుంటే చిన్నారి ఏడుస్తున్నాడని వదినను చంపేశాడు

భోపాల్: నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక వ్యక్తి.. చదువుకునే సమయంలో తన సోదరుడి కుమారుడు ఇబ్బంది కలిగిస్తున్నాడని వదినను కత్తితో పొడిచి చంపాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్‌లో మంగళవారం ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. మనోజ్ అహిర్వార్(22) అనే వ్యక్తి నీట్‌కు సిద్ధమవుతున్నాడు. అయితే ‘‘మనోజ్ చదువుకుంటుండగా అన్నయ్య కుమారుడు ఏడుపు అందుకున్నాడు. ఎంత ప్రయత్నించినా ఏడుపు ఆగలేదు. అక్కడే ఉన్న వదినతో చాలాసేపు వారించాడు. అయినా ఏడుపు తగ్గలేదు. కొంతసేపు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. దీంతో తీవ్ర కోపానికి లోనైన మనోజ్.. కిచెన్‌లోకి వెళ్లి కత్తి తీసుకుని వదిన కవిత అహిర్వార్(25)ను పొడిచాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో కవిత అక్కడికక్కడే చనిపోయింది’’ అని స్థానిక గాంధీనగర్ పోలీస్ట్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ కుమార్ శర్మ తెలిపారు.

Updated Date - 2022-04-19T22:57:59+05:30 IST