PVR Cinema's వాష్రూములో ప్రేక్షకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-07-09T02:06:49+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలోని వికాస్పురిలో ఉన్న పీవీఆర్ సినిమా థియేటర్లో ఓ ప్రేక్షకుడు ఆత్మహత్య చేసుకున్నాడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని వికాస్పురిలో ఉన్న పీవీఆర్ సినిమా థియేటర్లో ఓ ప్రేక్షకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. థియేటర్లోని వాష్రూములో ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన జేబులో ఉన్న ఆధార్ కార్డును బట్టి అతడి వయసును 44 సంవత్సరాలుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ పదునైన ఆయుధంతో అతడు తన తలపై గాయం చేసుకోవడం వల్లే మరణించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.