Shocking Video: నడిరోడ్డులో మహిళా లాయర్‌పై కిరాతక దాడి.. ఆమెను తంతూ, కొడుతూ..

ABN , First Publish Date - 2022-05-16T16:28:02+05:30 IST

దాడికి గురైన లాయర్ పేరు సంగీత షిక్కేరి. ఆమెపై దాడికి పాల్పడ్డ వ్యక్తి పేరు మహంతేష్ చోలచగుడ్డ. సంగీత పొరుగింట్లోనే మహంతేష్ ఉంటాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సివిల్ తగాదా విషయంలో సంగీతపై పగ పెంచుకుని ఈ దాడికి..

Shocking Video: నడిరోడ్డులో మహిళా లాయర్‌పై కిరాతక దాడి.. ఆమెను తంతూ, కొడుతూ..

బెంగళూరు: మహిళా న్యాయవాదిపై నడిరోడ్డులో ఒక వ్యక్తి ఆటవికంగా దాడికి దిగాడు. ఆమెను తంతూ, జుట్టు లాగుతూ కిరాకతంగా కొట్టాడు. ఇంత దాడి జరుగుతుంటే చుట్టూ ఉన్నవాళ్లు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. మొబైల్ ఫోన్లలో ఆ సంఘటనను వీడియో తీస్తూ అలాగే ఉండిపోయారు. బాధితురాలి భర్త అక్కడ ఉన్న వారిని సహాయం అడిగినా ఎవరూ స్పందించలేదు. కర్ణాటక రాష్ట్రంలోని బగల్‌కోట్ జిల్లా వినాయక్ నగర్‌లో ఆదివారం జరిగిందీ సంఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


దాడికి గురైన లాయర్ పేరు సంగీత షిక్కేరి. ఆమెపై దాడికి పాల్పడ్డ వ్యక్తి పేరు మహంతేష్ చోలచగుడ్డ. సంగీత పొరుగింట్లోనే మహంతేష్ ఉంటాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సివిల్ తగాదా విషయంలో సంగీతపై పగ పెంచుకుని ఈ దాడికి దిగాడట. ఆమె తనను అనేకమైన వేధింపులకు గురి చేసిందని, చాలా బాధ పెట్టిందని పోలీసుల ముందు మహంతేష్ తెలిపాడు. అయితే గతంలో కూడా వీరు తగువులాటకు దిగారట. కాగా, మహంతేష్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.



Updated Date - 2022-05-16T16:28:02+05:30 IST