Afghan: female anchors ముఖం కప్పుకొమ్మనందుకు maskలతో male anchors నిరసన
ABN , First Publish Date - 2022-05-23T20:10:19+05:30 IST
ఈ చానల్‌లో అత్యంత ప్రజాధరణ ఉన్న సాయంత్రం ‘న్యూస్‌రీడర్’ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సైతం మాస్క్ ధరించారు. ఇకపోతే అఫ్ఘాన్‌లో మహిళలపై ఇలాంటి ఆజ్ణలు, నిషేధాలు కొత్తేం కాదు. తొలుత 1996-2001 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనేక నిర్ణయాలు..

కాబూల్: మహిళా యాంకర్లు(female anchors) ముఖాలు కప్పుకుని కెమెరా ముందుకు రావాలని అఫ్ఘానిస్తాన్(Afghanistan)లోని తాలిబన్(Taliban) ప్రభుత్వం ఆదేశాలు చేసింది. కాగా, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పురుష యాంకర్లు(male anchors) మాస్క్(mask)లు ధరించి నిరసన తెలిపారు. హక్కుల కార్యకర్తలు ఈ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అఫ్ఘాన్‌లోని అనేక మీడియా సంస్థలు తాలిబన్ ఆదేశాలను పాటిస్తున్నాయి. గురువారం మొదటిసారి ఆదేశాలు జారీ చేసినప్పుడు కొంత మంది యాంకర్లు మాత్రమే ముసుగు వేసుకుని కనిపించారు. కానీ ప్రభుత్వ ఆదేశాల్ని తాలిబన్ వైస్ అండ్ వర్చ్యూ మినిస్ట్రీ అమలు చేయడం ప్రారంభించాక ఎక్కువ మంది ముసుగులోనే కనిపించారు. కాగా, ఇదే విషయమై అఫ్ఘాన్ ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్ మినిస్ట్రీ గతంలో స్పందిస్తూ ఈ నిర్ణయంపై ఇదే చివరి మాటని దీనిపై ఎలాంటి చర్చ ఉండబోదని స్పష్టం చేశారు.
‘‘మాస్క్ ధరించమని బలవంతపెట్టడం అఫ్ఘాన్ సంస్కృతి కాదు. ఇది బయటి సంస్కృతి. మాస్క్ ధరించి మా కార్యక్రమాలు నిర్వహించడం చాలా కష్టంగా ఉంది’’ అని అఫ్ఘాన్‌లోని టోలో టీవీ న్యూస్ యాంకర్ తెలిపారు. టోలో టీవీలోని పురుష జర్నలిస్టులు అందరూ మహిళా యాంకర్లకు మద్దతుగా మాస్క్‌లు ధరించి విధుల్లో పాల్గొన్నారు. ఈ చానల్‌లో అత్యంత ప్రజాధరణ ఉన్న సాయంత్రం ‘న్యూస్‌రీడర్’ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సైతం మాస్క్ ధరించారు. ఇకపోతే అఫ్ఘాన్‌లో మహిళలపై ఇలాంటి ఆజ్ణలు, నిషేధాలు కొత్తేం కాదు. తొలుత 1996-2001 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనేక నిర్ణయాలు తాలిబన్ ప్రభుత్వం తీసుకుంది. చదువు నిరాకరించడం, బుర్ఖాను ధరించాలనడం, వీధుల్లోకి రాకుండా అడ్డుకోవడం లాంటివి అనేకం చేశారు. ప్రస్తుతం కూడా ఇలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి.