train accident: గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్ రైలు...53మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-08-17T15:17:31+05:30 IST

గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటన బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని (Maharashtra)గోండియా(Gondia) నగర సమీపంలో జరిగింది....

train accident: గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్ రైలు...53మందికి గాయాలు

గోండియా(మహారాష్ట్ర): గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటన బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని (Maharashtra)గోండియా(Gondia) నగర సమీపంలో జరిగింది. సిగ్నల్ తప్పిదం వల్ల భగత్ కి కోఠి ప్యాసింజర్ రైలు ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.(train accident) ఈ ఘటనలో మూడు ప్యాసింజర్ బోగీలు పట్టాలు (three bogies of train derail)తప్పాయి.(train derail) ఈ దుర్ఘటనలో 53 మంది రైలు ప్రయాణికులు గాయపడ్డారు. గోండియా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మూడు రైలు బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు చెప్పారు.(collided with a goods train) 


ఈ ప్రమాదంలో గాయపడిన 53 మందిని గోండియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. రాయపూర్ నుంచి నాగపూర్ కు ప్యాసింజర్ రైలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒకే రైలు పట్టాలపై రైళ్లు ఎదురెదురు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పునరావాస పనులు చేపట్టారు. 

Updated Date - 2022-08-17T15:17:31+05:30 IST