Maharashtra Cabinet Expansion: బీజేపీకి 25, షిండే వర్గానికి 13 పదవులు?
ABN , First Publish Date - 2022-07-08T00:14:54+05:30 IST
ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని మహారాష్ట్ర

ముంబై : ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, బీజేపీకి 25 మంత్రి పదవులు, షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి 13 మంత్రి పదవులు లభించబోతున్నట్లు సమాచారం. అత్యంత కీలకమైన హోం, ఆర్థిక, రెవిన్యూ శాఖలను బీజేపీ మంత్రులకు కేటాయించే అవకాశం ఉందని, సాగునీటి పారుదల, పట్టణాభివృద్ధి శాఖలను ఏక్నాథ్ షిండే వర్గానికి ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు.
శివసేన చీలిన తర్వాత ఏక్నాథ్ షిండే వర్గం, బీజేపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శాసన సభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఈ ప్రభుత్వానికి అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. షిండే వర్గంలో 50 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని చిన్న పార్టీలు, స్వతంత్రులు కూడా మద్దతిచ్చారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.