Madarasa పదం ఉనికిలో ఉండకూడదు: Assam CM

ABN , First Publish Date - 2022-05-23T21:02:15+05:30 IST

సాధారణ విద్యా విధానం అందరికీ అందుబాటులో ఉన్న చోట ప్రత్యేకమైన మదర్సాలు అక్కర్లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తెలిపారు. తమ పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు చేయాలంటే వారికి అందించాల్సి విద్య పాఠశాలల్లో చెప్పేదని, మదర్సాలల్లో చెప్పేది కాదని అన్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

Madarasa పదం ఉనికిలో ఉండకూడదు: Assam CM

గువహాటి: సాధారణ విద్యా విధానం అందరికీ అందుబాటులో ఉన్న చోట ప్రత్యేకమైన మదర్సాలు అక్కర్లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తెలిపారు. తమ పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు చేయాలంటే వారికి అందించాల్సి విద్య పాఠశాలల్లో చెప్పేదని, మదర్సాలల్లో చెప్పేది కాదని అన్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘పాఠశాలలు పెట్టి ఖురాన్‌ను బోధించాల్సిన అవసరం లేదు. ఖురాన్ గురించి చెప్పాలనుకుంటే ఇంట్లో చెప్పండి. మీ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్ట్‌లు కావాలి. అలా కావాలంటే సైన్స్, మాథ్స్, బయోలజీ, బోటనీ, జూలజీ లాంటివి చదవాలి. ఈ చదువులు అన్ని పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఖురాన్‌లు బోధించే మదర్సాలు అక్కర్లేదు. ఇక నుంచి ఆ పదం ఉనికిలో ఉండకూడదు’’ అని అన్నారు.

Updated Date - 2022-05-23T21:02:15+05:30 IST