Lumpy skin disease:మూడు రాష్ట్రాల్లో లంపీ చర్మ వ్యాధి వ్యాప్తి...600 ఆవుల మృతి

ABN , First Publish Date - 2022-08-09T13:19:22+05:30 IST

ఉత్తరాది రాష్ట్రాల్లోని పశువుల్లో ప్రబలుతున్న లంపీ స్కిన్ డిసీజ్‌తో(Lumpy skin disease) రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు....

Lumpy skin disease:మూడు రాష్ట్రాల్లో లంపీ చర్మ వ్యాధి వ్యాప్తి...600 ఆవుల మృతి

చండీఘడ్ : ఉత్తరాది రాష్ట్రాల్లోని పశువుల్లో ప్రబలుతున్న లంపీ స్కిన్ డిసీజ్‌తో(Lumpy skin disease) రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో( Punjab, neighbouring Haryana and Himachal Pradesh)లంపీ చర్మవ్యాధితో 600కు పైగా ఆవులు(cows) మరణించాయి(kills). వ్యాక్సిన్ కొరతతో(SHORTAGE OF VACCINES) పశువుల్లో లంపీ చర్మవ్యాధి విస్తరిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్, మోగా,ముక్తసర్, బర్నాలా, భటిండా, ఫరీద్ కోట్ జిల్లాల్లో లంపీ స్కిన్ డిసీజ్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. హర్యానా రాష్ట్రంలోని యమునానగర్, భీవానీ, అంబాలా జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. 


హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలాన్, సిర్మైర్, బిలాస్ పూర్, హమీర్ పూర్, కంగ్రా, ఉనా జిల్లాల్లో జీనుస్ కాప్రిపాక్స్ వైరస్(Genus Capripox virus) కేసులు వెలుగుచూశాయి.పంజాబ్ రాష్ట్రంలో 500 కు పైగా ఆవులు లంపీ చర్మ వ్యాధితో మరణించడంతో పశువైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. రాజస్థాన్ రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాల్లో లంపీ చర్మవ్యాధి ప్రబలుతోందని, ఈ వ్యాధి క్రాస్ బ్రీడ్ పశువుల్లో అధికంగా ప్రబలుతోందని పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జశ్వంత్ సింగ్ చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో 27వేల ఆవులు లంపీ చర్మవ్యాధి బారిన పడ్డాయి.


 హర్యానాలో 5వేల ఆవులు జీనుస్ కాప్రిపాక్స్ వైరస్ తో సతమతమవుతున్నాయి.పంజాబ్ రాష్ట్రంలో పశువులకు వ్యాక్సిన్ అందించడంతో పాటు ఈ వ్యాధి వల్ల మరణించిన పశువులకుగాను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. లంపీ స్కీన్ డిసీజ్ మనుషులకు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పాలను బాగా మరిగిస్తే అందులో బాక్టీరియా మృతి చెందుతోందని డాక్టర్ గుర్విందర్ సింగ్ చెప్పారు. 


Updated Date - 2022-08-09T13:19:22+05:30 IST