Bharat Jodo Yatra : చరిత్ర ఎందుకు.. వర్తమానం చూడండి

ABN , First Publish Date - 2022-12-16T01:03:41+05:30 IST

రాజస్థాన్‌లో భారత్‌ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీ గురువారం కాంగ్రెస్‌ శ్రేణులకు స్పష్టమైన సందేశం పంపించారు. భజన కార్యక్రమాలు చెపట్టవద్దని

Bharat Jodo Yatra : చరిత్ర ఎందుకు.. వర్తమానం చూడండి

త్యాగధనులతో నన్ను పోల్చొద్దు.. శ్రేణులకు రాహుల్‌ సూచన

న్యూఢిల్లీ, డిసెంబరు 15: రాజస్థాన్‌లో భారత్‌ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీ గురువారం కాంగ్రెస్‌ శ్రేణులకు స్పష్టమైన సందేశం పంపించారు. భజన కార్యక్రమాలు చెపట్టవద్దని హితవు పలికారు. చరిత్రను చెప్పడం మాని వర్తమానాన్ని పట్టించుకోవాలని సూచించారు. పాదయాత్ర చేస్తున్న రాహుల్‌ను ఓ నాయకుడు మహాత్మా గాంధీ తో పోల్చగా అభ్యంతరం చెప్పారు. ‘‘ఇది పూర్తిగా తప్పు. వారితో నన్ను పోల్చవద్దు. మహాత్ముడు చాలా గొప్ప వ్యక్తి. మొత్తం జీవితాన్ని స్వాతంత్య్రం కోసం ధారపోశారు. 10-12 ఏళ్లు జైలులో ఉన్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. రాజీవ్‌ గాంధీ, ఇందిరా గాంధీలు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి కర్తవ్యాన్ని వారు నిర్వహించారు. మనం ప్రస్తుతం ఏం చేస్తున్నామో గమనించాలి. ప్రజల కోసం ఏమి చేస్తున్నామో ఆలోచించాలి’’ అని ఆయన అన్నారు.

Updated Date - 2022-12-16T01:03:42+05:30 IST