మళ్లీ Lockdown రాదు
ABN , First Publish Date - 2022-04-27T12:54:10+05:30 IST
రాష్ట్రంలో మళ్ళీ లాక్డౌన్ అమలు చేసే అవకాశమే లేదని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఆయన గిండి కింగ్స్ కరోనా

- ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి
చెన్నై: రాష్ట్రంలో మళ్ళీ లాక్డౌన్ అమలు చేసే అవకాశమే లేదని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఆయన గిండి కింగ్స్ కరోనా ఆస్పత్రిలో తనిఖీ నిర్వహించన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేయనున్నట్లు సామాజిక ప్రసార మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమవుతున్నా, రాష్ట్రంలో స్వల్పంగానే నమోదవుతోందని, మద్రాసు ఐఐటీలో మాత్రం కేసుల సంఖ్య 111కి చేరిందని తెలిపారు. రాష్ట్రంలో గతంలా వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందటం లేదని, కేసుల సంఖ్య తగ్గాలంటే వెంటనే అందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. ఢిల్లీలో ప్రస్తుతం ప్రతి వందమందికి ముగ్గురు లేదా నలుగురికి పాజిటివ్ లక్షణాలు బయటపడుతుండగా, రాష్ట్రంలో ప్రతి వెయ్యిమందిలో ముగ్గురికి పాజిటివ్ లక్షణాలు బయటపడుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో మాస్కు ధరించకపోతే రూ.500ల జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా మాస్కు పెట్టుకోవడం లేదని వాపోయారు.