అయోధ్యలో లతా మంగేష్కర్‌ చౌరస్తా

ABN , First Publish Date - 2022-09-29T09:03:10+05:30 IST

ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ 93వ జయంతి పురస్కరించుకుని ఆమె జ్ఞాపకార్థం అయోధ్యలో ఓ కూడలికి ‘లతా మంగేష్కర్‌ చౌరస్తా’గా నామకరణం చేశారు.

అయోధ్యలో లతా మంగేష్కర్‌ చౌరస్తా

ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ 93వ జయంతి పురస్కరించుకుని ఆమె జ్ఞాపకార్థం అయోధ్యలో ఓ కూడలికి ‘లతా మంగేష్కర్‌ చౌరస్తా’గా నామకరణం చేశారు. ఆమె స్మృతి చిహ్నంగా ఆ కూడలిలో భారీ వీణను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. సుమారు 7.9 కోట్ల రూపాయలతో ఓ నీటి కొలను మధ్యలో నిర్మించిన ఈ వీణను 40 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తులో తీర్చిదిద్దారు. 

Read more