Lalu Prasad Yadavపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు

ABN , First Publish Date - 2022-05-30T13:10:55+05:30 IST

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాలమూ కోర్టుకు హాజరుకానున్నారు....

Lalu Prasad Yadavపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు

పాలమూ కోర్టుకు హాజరు కానున్న నేత

రాంచీ (బీహార్): ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాలమూ కోర్టుకు హాజరుకానున్నారు.2010 నాటి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జూన్ 8న జార్ఖండ్ కోర్టుకు హాజరుకానున్నారు.దాణా కుంభకోణం కేసుల్లో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న లాలూ యాదవ్ 2010లో గర్వాలో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలపై పాలములోని స్థానిక కోర్టుకు హాజరుకానున్నారు.


గర్వాలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రసంగించిన ప్రచార ర్యాలీకి సంబంధించిన కేసు తాజాగా విచారణకు వచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ జూన్ 7న రాంచీకి చేరుకుని రోడ్డు మార్గంలో పాలముకు వెళతారు. మరుసటి రోజు ఉదయం కోర్టు ముందు లాలూ హాజరు కానున్నారు.లాలూ ప్రసాద్ యాదవ్‌కు స్వాగతం పలికేందుకు జార్ఖండ్ ఆర్జేడీ రాంచీ నుంచి పాలము వరకు 110 పైలాన్ గేట్లను నిర్మించింది. 


Updated Date - 2022-05-30T13:10:55+05:30 IST