ఎన్నికల కేసులో లాలూకు విముక్తి

ABN , First Publish Date - 2022-08-25T09:24:29+05:30 IST

ఎన్నికల కేసులో లాలూకు విముక్తి

ఎన్నికల కేసులో లాలూకు విముక్తి

పట్నా, ఆగస్టు 24: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ నిర్దోషి అని బుధవారం కోర్టు ప్రకటించింది. ఆయనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్‌కు మద్దతుగా రాఘవ్‌పూర్‌లో ప్రచారం చేశారు. ఆ ఎన్నికలను బీసీలు, ఉన్నత కులాల వారి మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధంగా అభివర్ణించారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీను ఓడించడానికి యాదవులు, ఇతర వెనుకబడిన కులాల వారు లౌకికపార్టీల కూటమికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే ఆయన కులపరమైన వ్యాఖ్యలు చేశారని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం కిందకే వస్తుందని ఎలక్షన్‌ కమిషన్‌ అభిప్రాయపడింది. ఆ మేరకు నోటీసు ఇచ్చింది. కేసు కూడా నమోదయింది. ఈ ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టు కేసును కొట్టివేసింది. 


Read more