లఖింపూర్ ఘటనలో ఆశిష్‌పై అభియోగాలు
ABN , First Publish Date - 2022-12-07T04:20:39+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖీరీలో జరిగిన హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశి్‌షపై మంగళవారం కోర్టులో
న్యూఢిల్లీ, డిసెంబరు 6: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖీరీలో జరిగిన హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశి్‌షపై మంగళవారం కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై వాహనం నడిపి నలుగురి మరణానికి కారకులయ్యారన్న ఆరోపణలతో అదనపు జిల్లా జడ్జి కోర్టులో అభియోగాలు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 12 మందిపైనా ఇవే అభియోగాలను మోపారు. హత్య, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర సహా ఐపీసీలోని ఎనిమిది సెక్షన్లు, మోటారు వాహన చట్టం, ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.