తిరిగి వస్తున్న కురుగోడు విద్యార్థి

ABN , First Publish Date - 2022-03-05T18:19:05+05:30 IST

కురుగోడు పట్టణానికి చెందిన నవీన్‌ కుమార్‌ ఎంబీబీఎస్‌ చదువు కోసం ఉక్రెయిన్‌ దేశానికి వెళ్ళాడు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్దం జరుగుతుండటంతో తండ్రి జగదీష్ గౌడ్‌ కుమారుడి విషయంపై ఆందోళన చెందుతుండగా

తిరిగి వస్తున్న కురుగోడు విద్యార్థి

కంప్లి(బెంగళూరు): కురుగోడు పట్టణానికి చెందిన నవీన్‌ కుమార్‌ ఎంబీబీఎస్‌ చదువు కోసం ఉక్రెయిన్‌ దేశానికి వెళ్ళాడు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్దం జరుగుతుండటంతో తండ్రి జగదీష్ గౌడ్‌ కుమారుడి విషయంపై ఆందోళన చెందుతుండగా కురుగోడు తహసీల్దార్‌ రాఘవేంద్రరావు కుటుంబీకులతో చర్చించి జిల్లా అధికారులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆ విద్యార్థి ఇప్పటికే ఉక్రెయిన్‌ నుంచి హంగేరి దేశానికి చేరుకున్నాడు. ప్రస్తుతం భారతదేశానికి ప్రయాణమైనట్లు తెలిపారు. నవీన్‌ కుమార్‌ తమ గ్రామానికి రెండు రోజుల్లో చేరుకోనున్నట్లు తహసీల్దార్‌ రాఘవేంద్ర తెలిపారు. 

Updated Date - 2022-03-05T18:19:05+05:30 IST