Mahabalipuram: గాలిపటాలు ఎగరేద్దాం రండి

ABN , First Publish Date - 2022-08-14T13:23:25+05:30 IST

చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం(Mahabalipuram)లో శనివారం ప్రారంభమైన ‘కైట్‌ ఫెస్టివల్‌’ విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్ర పర్యాటక శాఖ(State

Mahabalipuram: గాలిపటాలు ఎగరేద్దాం రండి

- మహాబలిపురంలో ‘కైట్‌ ఫెస్టివల్‌’

- వందడుగుల ఎత్తులో కనువిందు 


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 13: చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం(Mahabalipuram)లో శనివారం ప్రారంభమైన ‘కైట్‌ ఫెస్టివల్‌’ విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్ర పర్యాటక శాఖ(State Department of Tourism), స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని రాష్ట్ర మంత్రులు మదివేందన్‌, అన్బరసన్‌ ప్రారంభించారు. ఈ ఉత్సవంలో భారత్‌కు చెందిన ఆరు జట్లు, అమెరికా, థాయ్‌లాండ్‌, మలేసియా దేశాలకు చెందిన నాలుగు జట్లు పాల్గొన్నాయి. హీలియంగ్యాస్‌ నింపిన వివిధ ఆకృతులు, రంగులతో కూడిన భారీ బెలూన్లు సమారు వందడుగుల ఎత్తున ఎగిరాయి. అదే సమయంలో మరికొందరు చిన్న చిన్న బెలూన్లు ఎగురవేశారు. ముఖ్యంగా, తిరువళ్లువర్‌(Tiruvalluvar) చిత్రంతో ఎగురవేసిన గాలిపటం విశేషంగా ఆకట్టుకుంది. ఈ నెల 15 వరకు జరుగనున్న ఈ ఫెస్టివల్‌ను వీక్షించేందుకు పిల్లలకు ఉచితం కాగా, పెద్దలు రూ.150 ప్రవేశ రుసుంగా చెల్లించాల్సి వుంటుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రదర్శన జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు.



Updated Date - 2022-08-14T13:23:25+05:30 IST